Stock Market | ట్రేడింగ్ చివరి సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ బెంచ్ మార్క్‌లు సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 11.43 పాయింట్ల లాభంతో 65,087.25 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 4.80 పాయింట్లు పెరిగింది. మార్కెట్లు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. చివరి గంటన్నరలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,458.70 పాయింట్ల గరిష్ఠానికి చేరగా.. నిఫ్టీ 19,452.80- 19,334.75 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంతకాలతో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగాయి. చివరి గంటలో విక్రయాలకు దిగడంతో ఇంట్రాడే లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
ట్రేడింగ్‌లో జియోఫిన్, టాటా స్టీల్, మారుతీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలువగా.. పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, టెక్ మహీంద్రా లూజర్స్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా.. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్రంగాల షేర్లు 0.5శాతం చొప్పున పెరిగాయి. అదే సమయంలో పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లు పడిపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 నుంచి 0.8 శాతం లాభాలను నమోదు చేశాయి.