Stock Market | రెండు వారాల వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market | వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం జోష్ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పుడు, బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 88 పాయింట్ల లాభంతో 77,629 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్ల లాభంతో 24,285 వద్ద ట్రేడయ్యాయి.
Stock Market : వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం జోష్ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పుడు, బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 88 పాయింట్ల లాభంతో 77,629 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్ల లాభంతో 24,285 వద్ద ట్రేడయ్యాయి.
సోమవారం నాటి ట్రేడింగ్‌లో రంగాల వారీగా చూస్తే మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ మీడియా, ఆయిల్, గ్యాస్, ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే నిఫ్టీ హెల్త్‌కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాల సూచీలు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
విశ్లేషకుల అంచనా ప్రకారం.. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 24,200 నుంచి 24,600 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. దేశీయ ఆర్థికవ్యవస్థ బలంగా ఉండటం, కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం మార్కెట్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ, అధిక ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు లాభాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్ల వద్ద ఉండటం, పశ్చిమాసియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

