న్యూఢిల్లీ, జూన్ 22: కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్‌సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపైగా పెంచుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే డెస్క్‌లను 60వేలకు పెంచాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు 23వేలుగా ఉండగా, వచ్చే ఏడాది మార్చికల్లా మరో 37వేల డెస్క్‌లను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ నెలాఖర్లోగా 10వేల సీట్లను పెంచుకోవాలని భావిస్తున్నది. సంస్థాగత క్లయింట్ల నుంచే కంపెనీకి 65 శాతం వ్యాపారం వస్తుండగా, మిగతా 35 శాతం రిటైల్ క్లయింట్ల నుంచి పొందుతున్నట్టు సంస్థ తెలిపింది. కాగా, పుణెకు చెందిన ఈఎఫ్‌సీ (ఐ) లిమిటెడ్.. తెలంగాణసహా 7 రాష్ర్టాల్లో సేవలందిస్తున్నది. దీనికి 35కుపైగా కో-వర్కింగ్ సెంటర్లుండగా, మొత్తం 1.5 మిలియన్ చదరపు అడుగుల ఏరియాను కలిగి ఉన్నది. హైదరాబాద్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ స్టాక్ 108.2 మిలియన్ చదరపు అడుగులున్నట్టు క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదికలో తేలింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఎంఆర్, పుణె, చెన్నై నగరాల్లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ నిల్వలు 701.6 మి.చదరపు అడుగులున్నాయి.