జిందాల్లో శాతవాహన ఇస్పాత్ విలీనం
హైదరాబాద్‌కు చెందిన శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్.. స్టీల్ పైపుల తయారీ సంస్థ జిందాల్ సాలో విలీనమైంది. దివాలా ప్రక్రియలో భాగంగా ఇది జరిగింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు జిందాల్ సా తాజాగా తెలియజేసింది. రుణపీడిత శాతవాహన ఇస్పాత్ కంపెనీ కోసం జిందాల్ సా ఓ రిజల్యూషన్ ప్లాన్‌ను గతంలోనే సమర్పించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: హైదరాబాద్‌కు చెందిన శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్.. స్టీల్ పైపుల తయారీ సంస్థ జిందాల్ సాలో విలీనమైంది. దివాలా ప్రక్రియలో భాగంగా ఇది జరిగింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు జిందాల్ సా తాజాగా తెలియజేసింది. రుణపీడిత శాతవాహన ఇస్పాత్ కంపెనీ కోసం జిందాల్ సా ఓ రిజల్యూషన్ ప్లాన్‌ను గతంలోనే సమర్పించిన విషయం తెలిసిందే. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్-1 ఈ నెలారంభంలో ఆమోదం కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలోనే జిందాల్ సా ఇప్పుడు విలీన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాగా, శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్ 1989లో ఏర్పాటైంది. గనుల రంగానికి చెందిన ఈ కంపెనీలో 500 మంది వరకు ఉద్యోగులున్నారు. ఈ కంపెనీని పృథ్వీరాజ్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ సా రూ. 530 కోట్ల బిడ్‌తో దక్కించుకున్నది. బిడ్డింగ్‌లో వేదాంత, వెల్స్పన్ తదితర కంపెనీలూ పోటీపడ్డాయి. అయినప్పటికీ జిందాల్ సా గెలుచుకున్నది. ఇదిలావుంటే 50 మెగావాట్ల క్యాపిటీవ్ పవర్ ప్లాంట్‌తోపాటు ఏపీ, కర్నాటకల్లో పిగ్ ఐరన్, డైక్టెల్ ఐరన్ పైప్ ఉత్పాదక ప్లాంట్లూ శాతవాహన ఇస్పాత్కున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

