SBI | ఇదే సరైన సమయం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలు అమ్మేయండి: ఎస్బీఐ నివేదిక
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో వాటాల విక్రయానికి ఇదే సరైన సమయమని సర్కారీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సోమవారం తమ రిసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొన్నది.
- సర్కారీ బ్యాంకులు ఇంకా తగ్గాలి
SBI | న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో వాటాల విక్రయానికి ఇదే సరైన సమయమని సర్కారీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సోమవారం తమ రిసెర్చ్ రిపోర్ట్‌లో పేర్కొన్నది. ‘బ్యాంకులు ప్రస్తుతం పరిపుష్ఠంగా ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి ఇదే సరైన సమయం. త్వరగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని ‘కేంద్ర బడ్జెట్ 2024-25కి నాంది’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో ఎస్బీఐ అభిప్రాయపడింది.
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ ‘2022 అక్టోబర్‌లో కొనుగోలుదారుల నుంచి బిడ్లను ఆహ్వానించారు. 2023 జనవరిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం)కు కొందరు తమ ఆసక్తిని వ్యక్తపర్చారు. రాబోయే బడ్జెట్లో దీనిపై ఓ స్పష్టత రావచ్చు’ అని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఐడీబీఐలో కేంద్రం వాటా 45.48 శాతంగా ఉంటే, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 49.24 శాతంగా ఉన్నది. మిగతా వాటా మైనారిటీ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్నది. అయితే దాదాపు 61 శాతం వాటాను అమ్మేయాలని కేంద్రం, ఎల్ఐసీ చూస్తున్నాయి.
బ్యాంకుల సంఖ్య తగ్గాలి
ప్రస్తుతమున్న ప్రభుత్వ బ్యాంకులు మరింతగా ఏకీకృతం కావాలన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ వెలిబుచ్చింది. తద్వారా ఇంకా సర్కారీ బ్యాంకుల సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇప్పటికే గతంతో పోల్చితే ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఆయా బ్యాంకుల్లో ఒకటి, రెండు, అంతకుమించి బ్యాంకులు విలీనమైపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 12 సర్కారీ బ్యాంకులే మిగిలాయి. అయినప్పటికీ ఇంకా తగ్గాలని ఎస్బీఐ చెప్తుండటం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. డిపాజిట్లపై పొందే వడ్డీ ఆదాయంపై పన్నును సవరించాలని ఎస్బీఐ కేంద్రానికి సిఫార్సు చేసింది. మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మార్కెట్లకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని కోరింది.
‘2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రజల నికర ఆర్థిక పొదుపు జీడీపీలో 5.3 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఇది 5.4 శాతానికే పెరుగవచ్చనిపిస్తున్నది. అయితే మ్యూచువల్ ఫండ్ల రాబడులతో సమానంగా డిపాజిట్ల వడ్డీరేటుంటే సేవింగ్స్ బాగా పెరిగేందుకు వీలున్నది.’ అని ఎస్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ సందర్భంగా సూచించింది. ఈ నెల 23న ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

