హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆలోచనతో స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఆలోచన స్టార్టప్‌గా మారేందుకు స్టార్టప్ నిపుణులతో ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నారా? గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న బూట్ క్యాంప్‌లో మీ స్టార్టప్ ఆలోచనను పరీక్షించుకోండి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగనున్న ఇంక్యుబేషన్ సెంటర్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా పాల్గొని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. కొత్తగా స్టార్టప్‌లను ప్రారంభించాలన్న ఆసక్తి ఉండి, మంచి ఆలోచన కలిగిన వారు ఈ బ్యూట్ క్యాంప్‌కు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు, పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ లింకులో https://meraevents.com/event/idea-validation లో సంప్రదించాలని తెలిపారు.