Starbucks | స్టార్‌బక్స్ సీఈవోగా పుణె కుర్రాడు.. లక్ష్మణ్ శాలరీ ఎంతంటే?!
Starbucks | స్టార్‌బక్స్ సీఈవో లక్ష్మణ్ నర్సింహన్ వార్షిక వేతనం 1.3 మిలియన్ డాలర్లు, 1.6 మిలియన్ల డాలర్ల క్యాష్ బోనస్ అందుకుంటారు.
Starbucks | ప్రముఖ అంతర్జాతీయ కాఫీ షాప్.. స్టార్‌బక్స్ సీఈవోగా నియమితులైన లక్ష్మణ్ నర్సింహన్.. మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని జర్మనీలో పీజీ, పెన్నిసెల్వేనియా యూనివర్సిటీలోని లౌడర్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్నేషనల్ స్టడీస్, వార్టన్ స్కూల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పట్టా అందుకున్నారు.
సెర్చింజన్ `గూగుల్` సీఈవో సుందర్ పిచ్చాయ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి వారు వార్టన్ స్కూల్ సహ-విద్యార్థులు కావడం విశేషం. త్వరలో స్టార్‌బక్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మణ్ నర్సింహన్ ఈ పదవిలో ఉన్నంత వరకు వార్షిక వేతనం 1.3 మిలియన్ డాలర్లు, బేస్ శాలరీలో 200 శాతం సమానమైన క్యాష్ ఇన్సెంటివ్ అందుకుంటారు.
తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మణ్ నర్సింహన్.. మెకెన్సీ అండ్ కంపెనీలో చేరారు. అటుపై పెప్సికోలో 2012లో చేరిన నర్సింహన్.. లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతాల ఆపరేషన్లు బాధ్యతలు నిర్వర్తించడంతో సంస్థళ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందారు. 2019 సెప్టెంబర్‌లో ఆంగ్లో-డచ్ మల్టీ నేషనల్ కన్జూమర్ గూడ్స్ కంపెనీ రెకిట్ట్లో చేరారు. కరోనా వేళ ఆరోగ్యం, హైజిన్ ( health and hygiene ) ఉత్పత్తుల విక్రయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న లక్ష్మణ్ నర్సింహన్ త్వరలో సియాటెల్‌కు షిఫ్ట్ అవుతారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇన్కమింగ్ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్టార్‌బక్స్ డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా చేరతారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

