హైదరాబాద్, సెప్టెంబర్ 4 : లగ్జరీ ఫర్నిచర్ తయారీ సంస్థ స్టాన్లీ లైఫ్‌ైస్టెల్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో లగ్జరీ హోమ్‌కు సంబంధించిన అన్ని రకాల ఫర్నిచర్లు లభించనున్నాయని కంపెనీ చైర్మన్, వ్యవస్థాపకుడు సునీల్ సురేశ్ తెలిపారు.
కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, గత మూడు దశాబ్దాలుగా వినియోగదారులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నచ్చిన ఫర్నిచర్లు అందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తెలిపారు.