న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ బెలారస్ స్టార్ అరీనా సబలెంకా హ్యాట్రిక్ టైటిల్ దిశగా ముందుకెళ్తోంది. వరుస విజయాలతో అలవోకగా ప్రిక్వార్టర్స్ చేరింది. ఆమెతో పాటు ఉక్రెయిన్ స్టార్ మార్టా కోస్త్యుక్ కూడా ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంకా 6-3, 6-4తో వరుస సెట్లలో రఖిమోవా (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో కోస్త్యుక్ 6-3, 6-2తో 18వ సీడ్ అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించింది. కానీ, 19వ సీడ్ జాస్మిన్ పౌలిని (ఇటలీ)3-6, 3-6తో కిర్‌స్టియా (రుమేనియా)చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. రెండో రౌండ్ పోటీల్లో కజకిస్థాన్ స్టార్ రిబకినా 6-2, 6-4తో జెస్సికా మనెరొ (స్పెయిన్)ను చిత్తుచేయగా, అమెరికా అమ్మాయి కోకో గాఫ్.. 6-4, 7-6 (7/5)తో బడోస (స్పెయిన్)ను ఓడించింది.
ఫిలిప్పీన్స్ సంచలనం అలగ్జాండ్ర ఇయాలా.. 6-1, 6-4తో ఒలినింకొవ (ఉక్రెయిన్)పై గెలవగా రష్యన్ భామ మిర్రా ఆండ్రీవా 6-0, 6-2తో ఇవా లిస్ (జర్మనీ)ను ఓడించి టోర్నీలో ముందంజ వేశారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో నాలుగన్నర గంటల పోరాటంతో తొలిరౌండ్ గండాన్ని దాటిన జర్మనీ వీరుడు అలెగ్జాండర్ జ్వెరెవ్.. మరోసారి మారథాన్ పోరులో గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు. టాప్ సీడ్ జ్వెరెవ్. 6-4, 4-6, 7-6 (7/3), 6-7 (3/7), 6-3తో అన్‌సీడెడ్ ఆటగాడు క్వెంటిన్ హాలిస్ (ఫ్రాన్స్) ను ఓడించాడు. ఆరో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 4-6, 5-7, 2-6తో వాన్ డి జాండ్షల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడి రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు.