బాలీవుడ్ బాద్షాగా పేరొందిన షారుఖ్ ఖాన్ దేశీయ శ్రీమంతుల జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. రూ.12,490 కోట్ల వ్యక్తిగత సంపదతో ఖాన్కు ఈ జాబితాలో చోటు లభించింది. రూ.7,790 కోట్లతో జూహీ చావ్లా ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.
అలాగే లైఫ్ైస్టెల్, ఫిట్నెస్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న హృతిక్ రోషన్ రూ.2,160 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలువగా, రూ.1,880 కోట్లతో కరణ్ జోహర్ ఆ తర్వాతి స్థానంలో, రూ.1,630 కోట్ల ఆస్తిలో అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచారు.