ముంబై, జూన్ 10: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్..సరికొత్త బీమా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్లాన్లు యునిట్ లింక్డ్, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నవారికి ఇది సరైన ప్లాన్ అని వెల్లడించింది. లైఫ్ గోల్, లెగసీ(100 ఏండ్ల వరకు కవరేజ్) పేర్లతో విడుదల చేసిన ఈ ప్లాన్ల కింద 8 శాతం రిటర్నులు పంచనున్నది.
ఉదాహరణకు లైఫ్ గోల్ ప్లాన్ కింద 35 ఏండ్ల పాలసీ హోల్డర్ ఏడాదికి రూ.3 లక్షల చొప్పున 30 ఏండ్ల వరకు పెట్టుబడులు పెట్టిన వారికి రూ.2,93,37,365 లభించనున్నాయి. అంటే గరిష్ఠంగా 8 శాతం రిటర్ను పంచనున్నది. అలాగే లెగసీ ప్లాన్ కింద ఏడాదికి రూ.3 లక్షల చొప్పున 65 ఏండ్లపాటు పెట్టుబడులు పెట్టిన పాలసీదారులకు మెచ్యూర్డ్ సమయంలో రూ.39,72,88,199 లభించనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 2,90,156 పాలసీలను విక్రయించింది.