హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవో డీబీ)లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ‘తెలంగాణ’ రోల్ మాడల్‌గా నిలిచిందని, అవకాశాలు పుషలంగా ఉన్న ఇకడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్-యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూటా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయంలో ఆయనను ప్రత్యేకంగా కలిసింది.
టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, సిల్స్ తదితర రంగాల్లో ‘యూటా-తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తీసుకొచ్చిన సంసరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.