డిజిటల్ గవర్నెన్స్‌లో దిక్సూచిగా తెలంగాణ
డిజిటల్ గవర్నెన్స్‌లో రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్-ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ైక్లెమేట్ రెసిలియన్స్' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ..
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ గవర్నెన్స్‌లో రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్-ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ైక్లెమేట్ రెసిలియన్స్’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతం, వర్గానికో పరిమితం చేయకుండా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. టెక్నాలజీని వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర రంగాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్రపంచంతో గ్రామాలను కనెక్ట్ చేసేందుకు టీ-ఫైబర్
కృత్రిమ మేధస్సును ప్రజలకు మరింత చేరువ చేర్చేందుకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని ప్రపంచంతో కనెక్ట్ చేసేందుకు టీ-ఫైబర్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో స్వీడెన్ వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అవకాశాల గని అని, రాష్ట్రంలో అపారమైన టాలెంట్ పూల్ ఉన్నదని స్పష్టం చేశారు. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు ఏఐ అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. ఏఐ ఓ గేమ్ ఛేంజర్ అని, మన నైపుణ్యాలకు పదును పెట్టి దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలని సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

