ఏఐ, పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్
కృత్రిమ మేధ (ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐరాస వేదికగా 1ఎమ్1బీ సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..
- ఐరాస వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కృత్రిమ మేధ (ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐరాస వేదికగా 1ఎమ్1బీ సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ సహా నూతన సాంకేతిక రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తుండటంతో ఈ రంగంలో భారీగా అవకాశాలున్నాయని అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, బలమైన పారిశ్రామిక పునాదులు రాష్ట్రానికి ప్రధాన బలమని తెలిపారు.
సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఏఐ, డిజిటల్ ఆవిషరణలను వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి వంటి రంగాల్లో వినియోగించడం ద్వారా అనేక సమస్యలకు పరిషారాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ప్రగతి, ఆవిషరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే బలమైన ఆవిషరణల వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఇన్నోవేషన్ ఆధారిత ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

