హైదరాబాద్, జనవరి 31 (నమస్తేతెలంగాణ) : తెలంగాణను స్కిల్స్ క్యాపిటల్ ఆఫ్‌ది గ్లోబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. శుక్రవారం డార్క్ మేటర్ టెక్నాలజీస్ పేరిట కెనడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.