హైదరాబాద్, సెప్టెంబర్ 17 : రిటైల్ షాపింగ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఆర్ఎస్ బ్రదర్స్ ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘దసరా బ్లాక్‌బస్టర్ స్పాట్ గిఫ్ట్స్’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 వేల విలువ చేసే ప్రతీ కొనుగోలుపై విశేషమైన కానుకలు అందిస్తున్నది.
కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.4,495 విలువైన స్వర్ణ పట్టుచీరను కొనుగోలు చేసిన వారికి రూ.45 లకే మరో చీరను కానుకగా అందిస్తున్నది. అలాగే రూ.4,995 విలువైన పట్టు చీరను కొన్నవారికి మిక్సీగ్రైండర్ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నది.