NRI-OCI-Aadhar | ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఇండియా కార్డ్ హోల్డర్లు ఆధార్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకోసం యూఐడీఏఐ ప్రత్యేక ఫామ్ ప్రవేశ పెట్టింది. వీటి సాయంతో ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఇండియా (ఓసీఐ) కార్డు దారులు తమ పేర్లు ఆధార్ కోసం నమోదు చేసుకోవచ్చు.
ఎన్నారైలు తమకు, తమ మైనర్ పిల్లలకు ఆధార్ కార్డు కావాలనుకుంటే భారత్ కు తిరిగి వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయో మెట్రిక్ ధ్రువీకరణ కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. వారు తమ పాస్ పోర్టును సమర్పించాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారికి బర్త్ డే సర్టిఫికెట్ తప్పనిసరి కావాలి. ఆధార్ కార్డు పొందిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వ్యక్తిగత సమాచారం అప్ డేట్ చేయడం అసవసరం. ఎన్నారైలతోపాటు ప్రతి ఒక్కరూ తమ డేటాబేస్ లో చిరునామాను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
ఎన్నారైల కోసం యూఐడీఏఐ వేర్వేరు ఫామ్స్ ప్రవేశ పెట్టింది. భారత్లో చిరుమానా, భారత్ ఆవల చిరునామా, వయస్సు ఆధారంగా ఫామ్స్ ఉన్నాయి. 18 ఏండ్లు పైబడిన వారికి ఫామ్-1, భారత్ వెలుపల చిరునామా కల వారికి ఫామ్-2, ఫామ్-4, 5-18 ఏండ్ల లోపు పిల్లలకు ఫామ్-3, ఐదేండ్ల లోపు పిల్లలకు ఫామ్ -5, భారత్ వెలుపల చిరునామా గల ఐదేండ్ల లోపు పిల్లలకు ఫామ్-6 వినియోగించాలి.
ఇక ఓవర్సీస్ సిటిజన్ ఇండియా కార్డు దారులు ఆధార్ కార్డు పొందాలంటే స్వదేశంలో 182 రోజులు తప్పనిసరిగా ఉండాలి. 18 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గల వారు ఫామ్-7, 18 ఏండ్ల లోపు పిల్లలు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి.