హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పట్టు చీరలు, మెన్స్‌వేర్, కిడ్స్వేర్పై సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ దసరా పండుగకు భారీ ఆఫర్లను ఇస్తున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. ‘నంబర్‌వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్’, షరతు లేని ఆఫర్లు, అధికమైన సేవింగ్స్‌తో కస్టమర్లకు హృదయ పూర్వక స్వాగతం తెలుపుతున్నట్టు పేర్కొంది.
కస్టమర్ల కోసం శారీస్వేర్, మెన్స్‌వేర్, లేడిస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చూడీదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్లో లేటేస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా దసరా, దీపావళి సందర్భంగా ప్రతిరోజూ అద్భుతమైన కలెక్షన్లను అతి తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు. హెడీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్టు, క్రెడిట్ కార్డు ఈఎంఐపై, రూ. పదివేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు సంస్థ యాజమాన్యం వెల్లడించింది.