హైదరాబాద్, జూలై 2: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరోసారి ఆషాఢం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 15వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రకటించిన ఈ బ్లాక్బాస్టర్ ఆఫర్లు ఈ నెల 3 నుంచి ప్రారంభంకానున్నాయని, అన్ని రకాల స్టాక్‌పై 66 శాతం వరకు తగ్గింపు ధరతో అందిస్తున్నది.
ఆషాఢం షాపింగ్ కిలోల్లో..సంతోషం టన్నుల్లో అనే నినాదంతో కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఉన్న రిటైల్ అవుట్లెట్లలో కల్పిస్తున్నది. పట్టుచీరలు, డిజైనర్ చీరలతోపాటు పురుషులు, పిల్లల దుస్తులను తగ్గింపు ధరలతో అందిస్తున్నట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు.