దేశీయ మార్కెట్లోకి సీఎన్జీ ట్రాక్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలిక ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ట్రాక్టర్లను నాగపూర్లో జరుగుతున్న 16వ ఎడిషన్ అగ్రి సమ్మిట్లో ప్రదర్శించింది.
వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది. వీటిని 2 వేల ఆర్పీఎం ఇంజిన్, సైడ్-షిఫ్ట్ గేర్ సిస్టమ్, 40 కిలోల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో తీర్చిదిద్దినట్టు కంపెనీ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు.