హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రముఖ సోలార్ ఎనర్జీ సంస్థ సన్‌టెక్ ఎనర్జీ.. తాజాగా మరో బ్రాండ్ ట్రూజెన్ సోలార్ బ్రాండ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ బ్రాండ్‌కు మార్కెట్లో మరింత ప్రచారం కల్పించడానికి తెలుగు హీరో మహేష్ బాబును ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, ఎండీ భవాని సురేశ్ మాట్లాడుతూ..పునరుత్పాదక విద్యుత్ రంగంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేసినట్లు, దేశంలో ఐదు అతిపెద్ద సోలార్ ఈపీసీ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఇందుకోసం తెలుగు హీరో మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు చెప్పారు. అలాగే వ్యాపార విస్తరణలో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో కొత్తగా 150కి పైగా డీలర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇరు రాష్ర్టాల్లో 60 డీలర్లు ఉన్నారు. దేశవ్యాప్త విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను నెలకొల్పుతున్నట్లు, తద్వారా ఆయా రాష్ర్టాల్లో సౌర పరికరాలు విక్రయించడానికి మరింత సులభతరం కానున్నదన్నారు.