Soft Bank Quits Paytm | మరిన్ని చిక్కుల్లో పేటీఎం.. బోర్డు నుంచి సాఫ్ట్ బ్యాంక్ ఔట్
Soft Bank Quits Paytm | పేటీఎంతోపాటు పాలసీ బజార్ బోర్డుల నుంచి జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్ బ్యాంక్ వైదొలగనున్నది.
Soft Bank Quits Paytm | ఇప్పటికే ఆర్బీఐ నిషేధంతో పూర్తిగా చిక్కుల్లో పడ్డ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నది. పేటీఎంతోపాటు ఆన్లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీ బజార్లో జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈ రెండు సంస్థల బోర్డుల నుంచి సాఫ్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకోనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచి తప్పుకోవాలని ఇంతకుముందే సాఫ్ట్ బ్యాంక్ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే పేటీఎం, పాలసీ బజార్లలో తమ డైరెక్టర్లను సాఫ్ట్ బ్యాంక్ ఉపసంహరించుకోనున్నది. రెగ్యులేటరీ సమస్యల పరిష్కారంలో విఫలమైనందుకే ఈ రెండు సంస్థల్లో సాఫ్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలుగుతున్నారని సమాచారం.
అయితే, పేటీఎంలోనూ, పాలసీ బజార్లోనూ సాఫ్ట్ బ్యాంక్ నిధులు కొనసాగుతాయని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై సాఫ్ట్ బ్యాంక్ గానీ, పేటీఎం గానీ, పాలసీ బజార్ కానీ ప్రతి స్పందించలేదు. వన్ 97 కమ్యూనికేషన్స్ అనుబంధ పేటీఎం, పీబీ ఫిన్‌టెక్ అనుబంధ పాలసీ బజార్ గతేడాది ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- paytm
- Policy Bazar
- Soft Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

