హైదరాబాద్, ఆగస్టు 14: స్మార్ట్ బజార్..ఫుల్ పైసా వసూల్ సేల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఆఫర్లలో అన్ని రకాల ఉత్పత్తులను తగ్గింపు ధరకు విక్రయించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. కిరాణా సామాన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్‌పై తగ్గింపునిస్తున్నది. 5కిలోల బాస్మతి రైస్+3 లీటర్ల ఆయిల్ ప్యాకెట్ కలుపుకొని రూ.725కి విక్రయిస్తున్నది. అలాగే ఒకటి కొంటే మరో జీన్స్, రెండు కొంటే మరో రెండు బిస్కెట్ ప్యాకెట్లు, రూ.339కే 500 గ్రాముల బాదం, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 900కి పైగా స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచింది.