హైదరాబాద్, జనవరి 20: మరోసారి ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది స్మార్ట్బజాజ్. ఫుల్ పైసా వసూల్ పేరుతో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 900కి పైగా స్టోర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఐదు కిలోల బియ్యం, 3 లీటర్ల నూనె ప్యాకెట్లు కలుపుకొని రూ.799కి విక్రయిస్తున్న సంస్థ..మూడు శీతల పానియాలు కొనుగోలు చేసిన వారికి ఒక్కటి ఉచితంగా అందిస్తున్నది. అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్లపై ఒక్కటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై రాయితీని ఇస్తున్నది.