Maruti Suzuki | దటీజ్ మారుతి సుజుకి.. ఒకప్పుడు బుల్లి కార్ల జెయింట్.. ఇప్పుడు ఎస్‌యూవీల్లో ఫస్ట్.. !
Maruti Suzuki | ఒకప్పుడు బుల్లి కార్లకు పాపులరైన మారుతి సుజుకి.. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా జూలై ఎస్ యూవీ కార్ల విక్రయాల్లో 24.7 శాతం వాటా కొట్టేసింది. గతేడాది చివరిలో మార్కెట్లోకి తెచ్చిన గ్రాండ్ విటారా ఎస్యూవీ మోస్ట్ పాపులర్ కారుగా నిలిచింది.
Maruti Suzuki | ఒకప్పుడు బుల్లి కార్ల తయారీకి పెట్టింది పేరు మారుతి సుజుకి.. అటుపై క్రమక్రమంగా కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో వారికి చేరువయ్యేందుకు తహతహలాడుతోంది. హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్లు, మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంవీపీ), స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) తయారీలో దూసుకెళ్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నవారు.. ప్రత్యేకించి ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కార్లను డిజైన్ చేస్తూ.. వారి మన్ననలు పొందుతోంది. ఎస్యూవీ కార్ల తయారీ.. సేల్స్‌లోనూ తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది మారుతి.
ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన ఫ్రాంక్స్ తోపాటు బ్రెజా, గ్రాండ్ విటారా ఎస్యూవీ కార్లకు జూలైలో మంచి డిమాండ్ ఉందంటే అతిశయోక్తి కాదు. గత నెలలో అమ్ముడైన ఎస్ యూవీ కార్లలో ప్రధాన వాటా ఈ మూడు మోడల్ కార్లదే.
ఈ ఏడాది జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్ ఎస్ యూవీ కార్లను ఆవిష్కరించింది మారుతి సుజుకి. గతేడాది చివరిలో ఆవిష్కరించిన గ్రాండ్ విటారా.. మారుతి సుజుకి కార్లలో అత్యంత పాపులర్ మోడల్ కారు. గత నెలలో 42,600 ఎస్యూవీ కార్లను విక్రయించింది మారుతి.
ఒకప్పుడు స్మాల్ కార్లకు పెట్టింది పేరు మారుతి.. కానీ ఎస్‌యూవీలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్ల ఉత్పత్తి తగ్గిస్తోంది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా పవర్ ట్రైన్ ఆప్షన్స్ అందుబాటులోకి తేవడంతో మారుతి ఎస్యూవీ కార్ల సేల్స్ పెరిగాయి. జూలై ఎస్యూవీ కార్ల సేల్స్‌లో 24.7 శాతం మారుతి సుజుకిదే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

