హైదరాబాద్: ప్రముఖ ఆఫీస్ స్పేస్ నిర్వాహణ సంస్థ స్కూటర్, దేశంలోనే తొలి ఉష్ణమండల అటవీ థీమ్‌తో ఆఫీస్ స్పేస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలోని 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ‘స్కూటర్ ఫారెస్ట్’ను బుధవారం ప్రారంభించింది. ఈ కార్యాలయం లోపల, వెలుపల సుమారు 150 జాతులకు చెందిన 8,000 మొక్కలున్నాయి.
ప్రైవేట్ కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్, ఫుడ్ అండ్ డ్రింక్స్, టెర్రస్‌పై ఫలహారశాలతోపాటు అనేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఈ సెంటర్లో బహిరంగ సీటింగ్ క్లస్టర్లు, ప్రకృతిని మైమరిపించే బహుళ అంతస్తు నిర్మాణాలతోపాటు ఒక ఆర్ట్ గార్డెన్ కూడా ఉన్నది. పరస్పర ఇంట్రాక్షన్, వినోదం కోసం కొన్ని విభిన్న జోన్స్ కూడా ఉన్నాయి.
హైదరాబాద్ స్కూటర్ కార్యాలయంలోని సదుపాయాల గురించి ఆ సంస్థ కంట్రీ హెడ్ రజత్ జోహార్ వివరించారు. ప్రపంచ, దేశీయ వ్యాపార కేంద్రీకృత విధానాల నేపథ్యంలో అనేక రంగాలు, మౌలిక సదుపాయాలతో కూడిన తమ హైదరాబాద్ కార్యాలయం గత కొన్నేండ్లుగా ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిందని వెల్లడించారు. నేటి డైనమిక్ కార్పొరేట్ సంస్థల ఆకాంక్షలను ప్రతిధ్వనించేలా బెస్పోక్ ఆఫీసులను అందించడం ద్వారా భవిష్యత్ వర్క్‌స్పేస్ డిమాండ్‌ను తమ సంస్థ తీరుస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్‌లో మూడు చోట్ల 3.25 లక్షల చదరపు అడుగులకు పైగా స్థలాన్ని స్కూటర్ లీజుకు తీసుకున్నదని రజత్ జోహార్ చెప్పారు. హైటెక్‌సిటీలోని RMZ ఫ్యూచురా, ప్రస్తుతం ‘స్కూటర్ ఫారెస్ట్’తోపాటు డల్లాస్ సెంటర్, మై హోమ్ ట్విట్జా పేరుతో కార్యాలయాలు ఉన్నట్లు వివరించారు. ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్‌లోని తొమ్మిది కేంద్రాలలో 5.37 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని తమ కంపెనీ నిర్వహిస్తున్నదని చెప్పారు.
‘వర్క్‌స్పేస్‌ని ఒక సేవ’గా స్కూటర్ అందిస్తున్నదని రజత్ అన్నారు. ఆఫీస్ కార్యాలయాలపై ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టకుండా, తమ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తిగా అనుకూలమైన, సౌకర్యవంతమైన ఆఫీస్ స్పేస్ ప్రయోజనాలను పలు సంస్థలు తమ ద్వారా పొందుతున్నాయని ఆయన వివరించారు.