న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను పరిచయం చేసింది స్కోడా ఇండియా. ఒక్టావియా పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ కారు ధర రూ.49.99 లక్షలుగా నిర్ణయించింది. రెండు లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 6.4 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.