Skoda | న్యూఢిల్లీ, డిసెంబర్ 2: చెక్‌రిపబ్లిక్ వాహన సంస్థ స్కోడా.. భారత్‌లో పాగవేయడానికి పావులుకదుపుతున్నది. ఇప్పటికే పలు మాడళ్లను విడుదల చేసిన సంస్థ..తాజాగా మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ సరికొత్త మాడల్‌ను పరిచయం చేసినట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్ జనేబా తెలిపారు.
రెండు రకాల్లో లభించనున్న ఈ కైలాఖ్ మాడల్ రూ.7.89 లక్షల నుంచి రూ.14.40 లక్షల ధరల శ్రేణిల్లో లభించనున్నదన్నారు. ఈ నూతన మాడల్‌తో వచ్చే ఏడాది 80 వేల యూనిట్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలి 33,333 కస్టమర్లకు కాంప్లిమెంటరీ కింద మూడేండ్లపాటు స్టాండర్డ్ మేంటనెన్స్ ప్యాకేజీ అందిస్తున్నది. ఇప్పటికే బుకింగ్‌లు ఆరంభించిన సంస్థ..వచ్చే నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.