Skoda Kodiaq | జెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India).. దేశీయ మార్కెట్లో ఏడు సీట్ల ఎస్యూవీ కొడియాక్ (Kodiaq) ఆవిష్కరించింది. డోర్ ఎడ్జ్ ప్రొటెక్టర్ సహా పలు సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది. తొలుత ఇదే ఫుల్ సైజ్ ఎస్యూవీ కారును స్కోడా ఆటో ఇండియా 2017లో ఆవిష్కరించింది. తాజాగా ఈ మోడల్ కారుకు గిరాకీ పెరిగింది. మార్కెట్లోకి తెచ్చిన 24 గంటల్లో 759 యూనిట్ల 2023-కొడియాక్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రతి త్రైమాసికంలో కొత్తగా 750 కొడియాక్ కార్లను మార్కెట్లోకి తేనున్నట్లు స్కోడా ఆటో ఇండియా తెలిపింది.
స్కోడా ఆటో ఇండియా ఎస్యూవీ కొడియాక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. స్టైల్, స్పోర్ట్‌లైన్, ఎల్ అండ్ కే వేరియంట్లలో లభ్యం అవుతుంది. కారు సెకండ్ రోలో కూర్చునే వారికి లార్జ్ లాంజ్ స్టెప్స్, ఔటర్ హెడ్ రెస్ట్లు అందుబాటులో ఉంటాయి. కొడియాక్ కారు ధర రూ.37.99 లక్షల నుంచి రూ.41.39 లక్షల మధ్య పలుకుతుంది.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఎట్ రేర్, కారు ఫ్రంట్‌లో సిగ్నేచర్ గ్రిల్లే వంటి ఫీచర్లు ఉంటాయి. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అమల్లోకి తెచ్చిన రెండో దశ బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న.. 2.0 టీఎస్ఐ ఎవో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 187 బీహెచ్‌పీల విద్యుత్, 320 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా లభిస్తుంది. ఇంతకుముందు మోడల్ కారుతో పోలిస్తే 4.2 శాతం ఫ్యుయల్ ఎఫిసియెంట్గా ఉంటుంది.
ఇథనాల్ కలిపిన పెట్రోల్.. ఈ-20 పెట్రోల్‌తోనూ కొడియాక్ నడుస్తుంది. 7.8 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. ఈ కారు ఆరు డ్రైవింగ్ మోడ్స్.. ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యుయల్, స్నో మోడ్ల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు 4×4 సిస్టమ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది.
కొడియాక్ కారు కనెక్టివిటీ కోసం మై స్కోడా కనెక్టెడ్ (MySKODA ConnectED) కూడా అందిస్తున్నారు. 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సపోర్ట్స్ నేవిగేషన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. యూఎస్బీ-సీ పోర్ట్స్, ప్రయాణికుల ఫోన్లకు వైర్లెస్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కాంటాన్ 625 వాట్ల 12-స్పీకర్ ఆడియో సిస్టమ్ విత్ సబ్ వూఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది.
కారులో ప్రయాణించే ప్రయాణికుల సేప్టీ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఆటోమేటిక్ డిమ్మింగ్, డీఫాగింగ్, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ అసిస్టెంట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కారులో ఫ్రంట్ సీట్స్ విత్ 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆప్షన్ కలిగి ఉంటాయి.