ముంబై, డిసెంబర్ 17: స్కోడా కూడా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కైలాక్ మాడల్ ఈ పెంపు నుంచి మినహాయింపునిచ్చింది. దీంతో కుషక్, స్లావియా, సూపర్బ్, కొడిక్యూ మాడళ్లు మరింత ప్రియంకానున్నాయి. అలాగే జీప్, సిట్రోయిన్ మాడళ్ల ధరలను కూడా 2 శాతం పెంచుతున్నట్లు స్టెల్లాంటిస్ పేర్కొంది.