హైదరాబాద్, అక్టోబర్ 2: దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా..సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఎల్రోక్ మాడల్‌ను ప్రవేశపెట్టింది. 82 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 581 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. కేవలం 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దీంతోపాటు మరో మాడల్ ఎల్రోక్ 50ని కూడా పరిచయం చేసింది. 52 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ రెండు మాడళ్లు రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఐదుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారులో 13 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, పూర్తిస్థాయిలో డిజిటల్ స్క్రీన్, 470 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.