Simple Dot One | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ‘సింపుల్ ఎనర్జీ’ భారత్ మార్కెట్లోకి ‘సింపుల్ డాట్ వన్’ అనే పేరుతో రెండో ఈవీ స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర రూ.99,999 (ఎక్స్ షోరూమ్) గా ఖరారు చేసింది. ఈ ధర ప్రీ బుకింగ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త ధర వచ్చే నెలలో ప్రకటిస్తామని తెలిపింది. ఇంతకుముందు ‘సింపుల్ వన్’ పేరుతో ఈవీ స్కూటర్ విడుదల చేసింది సింపుల్ ఎనర్జీ.
ఈ సింపుల్ డాట్ వన్’ ఈవీ స్కూటర్ నాలుగు రంగులు- నమ్మ రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 3.7 కిలోవాట్ల బ్యాటరీతోపాటు 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. కేవలం 2.7 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకునే సింపుల్ డాట్ వన్ స్కూటర్ గంటలో గరిష్టంగా 105 కి.మీ దూరం ప్రయాణిస్తుందని తెలిపింది.
సింగిల్ చార్జింగ్‌తో 151 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ సింపుల్ డాట్ వన్ స్కూటర్. 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లేతో వస్తున్న ఈ స్కూటర్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటది. తొలుత బెంగళూరు కేంద్రంగా ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రారంభిస్తారు. అటుపై దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపింది.