హైదరాబాద్, ఏప్రిల్ 21: హైదరాబాద్‌కు చెందిన శ్రీ బయో ఈస్తటిక్స్..సుల్తాన్‌పూర్‌లోని టీఎస్ఐఐసీలో ఇంటిగ్రేటెడ్ అగ్రిబయోటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రూ.30 కోట్ల పెట్టుబడితో 1.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలు త్వరలో ప్రారంభించనున్నారని కంపెనీ ఎండీ కేఆర్కే రెడ్డి తెలిపారు.
ప్రాథమిక, అనువర్తిత పరిశోధనలను నిర్వహించడమే కాకుండా నాణ్యమైన బయోలాజికల్ అగ్రి ఇన్‌ఫుట్, టెస్టింగ్ సేవలతో వ్యవసాయ కమ్యూనిటీ అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేయనున్నదని చెప్పారు. పలు రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విశ్లేషకులు తమ ఆలోచనలు పంచుకోవడానికి ఈ సెంటర్ ఒక ప్లాట్‌ఫాంగా పనిచేయనున్నదని ఆయన తెలిపారు.