Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ వార్తలు మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. సెన్సెక్స్ 158 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్‌కు ఎగువన ముగిసింది. చివరలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా తగ్గాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 82,534.61 పాయింట్ల వద్ద లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 81,900.12 పాయింట్ల కనిష్టానికి తగ్గిన సెన్సెక్స్.. 83,018.16 గరిష్టంగా పాయింట్లకు పెరిగింది.
చివరకు 158.32 పాయింట్ల నష్టంతో 82,055.11 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72.45 పాయింట్లు పెరిగి 25,044.35 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీలో జియో ఫైనాన్సియల్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, కొటక్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ అత్యధిక లాభాలను ఆర్జించాయి. ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, మారుతి సుజూకీ, హెచ్‌టీసీ, భారత్ ఎలక్ట్రికల్ నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంక్ 1.5 శాతం లాభపడగా.. నిఫ్టీ మెటల్ ఒకశాతం శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా 0.7 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా ఒకశాతం శాతం పడిపోయాయి.