81 వేల పైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని అధిగమించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
- మరో మైలురాయిని అధిగమించిన సూచీ
ముంబై, జూలై 18: దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని అధిగమించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తొలిసారిగా 81 వేల మైలురాయిని అధిగమించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఈ రికార్డును అధిగమించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 626.91 పాయింట్లు అందుకొని 81,343.46 పాయింట్ల వద్ద స్థిరమైంది. బలహీనంగా ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో రివ్వున ఎగిశాయి. ఐటీ రంగ సంస్థలు అంచనాలకుమించి రాణిస్తుండటంతో మదుపరులు ఈ షేర్లను కొనుగోలు చేయడానికి ఎగబడటంతో ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. మరో సూచీ నిఫ్టీ ఒక దశలో 220 పాయింట్లకు పైగా బలపడ్డ సూచీ చివర్లో 187.85 పాయింట్లు అందుకొని 24,800.85 వద్ద స్థిరపడింది.
- టీసీఎస్ 3.33 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. ఇన్ఫోసిస్ 1.93 శాతంతోపాటు బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, హెచ్సీఎల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- ఐటీ, టెలికం, ఆటో, టెక్ రంగ షేర్లు లాభపడగా..క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్స్, యుటిలిటీ రంగ షేర్లు నష్టపోయాయి.
- గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,446 పాయింట్లు(1.79 శాతం), నిఫ్టీ 485 పాయింట్లు(1.98 శాతం) బలపడ్డాయి.
- బ్రెంట్ క్రూడాయిల్ ధర తగ్గడం కూడా సూచీలు పుంజుకునేలా చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- IT Stocks
- nifty
- Sensex
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

