మార్కెట్లో ఎందుకీ ఆటుపోట్లు
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి బీజేపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాబోదన్న అంచనాలే ఇందుకు కారణమని ఎక్కువ మంది నిపుణులు పేర్కొంటున్నారు. 2019తో పోల్చితే సీట్లు తగ్గుతాయంటున్నారు.
- వచ్చే రెండు నెలలూ తీవ్ర ఒడిదొడుకుల్లోనే ట్రేడింగ్
- మెజారిటీ నిపుణులు ఏమంటున్నారు?
న్యూఢిల్లీ, మే 16: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి బీజేపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాబోదన్న అంచనాలే ఇందుకు కారణమని ఎక్కువ మంది నిపుణులు పేర్కొంటున్నారు. 2019తో పోల్చితే సీట్లు తగ్గుతాయంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి బలమైన కౌంటర్ లేకపోవడం ఈ అంచనాలకు మద్దతునిస్తున్నదిప్పుడు. ఈ క్రమంలోనే మదుపరులు భయాందోళనలకు గురై.. పెట్టుబడులపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, అది ఒడిదొడుకులకు దారి తీస్తున్నదని స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సరళిని అంతా విశ్లేషిస్తున్నారు. అంతేగాక వచ్చే రెండు నెలలూ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పవంటున్నారు. కొత్త ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై ఉంటుందంటున్నారు.
మార్పును కోరుతున్నారు..
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా జరిగిన పోలింగ్‌పై విశ్లేషకుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడాన్ని వివిధ రకాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం ఎన్నికల ఫలితాలను ఎటువైపైనా తిప్పగలదని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంటున్నది. పదేండ్లు అధికారంలో ఉన్నందున ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కూడా చెప్తున్నది. 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా చేసిన బాలకోట్‌పై విమాన దాడి కలిసొచ్చిందంటున్న బెర్న్‌స్టెయిన్.. 2014 కంటే తక్కువ స్థాయిలోనే ఈసారి సీట్లు వస్తాయని విశ్లేషిస్తున్నది. ఇంకోవైపు మోజోపీఎంఎస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ దమానియా పడిపోయిన ఓటింగ్ శాతం.. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలం కాగలదంటున్నారు. ఇదిలావుంటే ఈ నెల మొదలు ఇప్పటిదాకా నిఫ్టీ దాదాపు 2 శాతం పడిపోయింది. నిజానికి ఈ నెల 3న సూచీ ఆల్‌టైమ్ హై (22,794.70)ని తాకింది. అయినప్పటికీ స్థిరత్వ లోపం కారణంగా వచ్చిన నష్టాలతో పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను అదేపనిగా వెనక్కి తీసుకుంటుండటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా మార్కెట్ల ఒడిదొడుకులకు కారణమవుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటికి ఇండియా వీఐఎక్స్ (అస్థిరత సూచీ) అద్దం పడుతున్నదని గుర్తుచేస్తున్నారు.
ఊగిసలాట మధ్య లాభాలే..
తీవ్ర ఒడిదొడుకుల మధ్య గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 676.69 పాయింట్లు లేదా 0.93 శాతం పెరిగి 73,663.72 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 73,749.47 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఇంకోసారి 72,529.97 పాయింట్ల కనిష్ఠాన్ని చేరింది. ఫలితంగా మదుపరులు లాభనష్టాల నడుమ ఊగిసలాడారు. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 203.30 పాయింట్లు లేదా 0.92 శాతం అందుకుని 22,403.85 వద్ద నిలిచింది. బుధవారం కూడా తీవ్ర ఒడిదొడుకుల నడుమ మార్కెట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Bharti Airtel
- M&M
- nifty
- Sensex
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

