ముంబై, జూలై 1: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ముడి చమురు ధరలు, గ్లోబల్ ఈక్విటీల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో కోలుకున్నాయి.
బ్యారెల్ క్రూడాయిల్ రేటు 1.07 శాతం తగ్గి 72.17 డాలర్లుగా ఉన్నది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 443.97 పాయింట్లు లేదా 0.58 శాతం ఎగబాకి 76,922.64 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 140.10 పాయింట్లు లేదా 0.59 శాతం అందుకుని 24,005.85 వద్ద నిలిచింది.