న్యూఢిల్లీ: బడ్జెట్ ముందు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు (Stock Markets).. ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని పూర్తిచేసేలోగా నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఉదయం 9.15 గంటలకే ప్రారంభమయ్యాయి. బడ్జెట్లో ప్రోత్సాహకాలేమైనా ప్రకటిస్తారనే అంచనాలతో ప్రారంభంలో సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. అయితే మధ్యాహ్నం 12 గంటలకు నష్టాలను చవిచూశారు.
బీఎస్ఈ సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో 33 పాయింట్లు కోల్పోయి 77,466 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ కూడా 50 పాయింట్ల నష్టంతో 23,450 వద్ద ఉన్నది. సెన్సెక్స్‌లో హెచ్ఎఫ్సీఎల్, హుందాయ్, మహింద్రా అండ్ మహింద్రా, ప్రెస్టేజ్ ఎస్టేట్, మారుతీ సుజుకీ, గోద్రేజ్ కన్స్యూమర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక ఎస్కార్ట్ కుబోటా, టాటా మోటార్స్, జిందాల్, హుడ్కో, లార్సన్ షేర్లు భారీగా నష్టాలు చవిచూశాయి.