ముంబై, నవంబర్ 12 : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు దేశీయంగా బ్యాంకింగ్, పవర్, వాహన రంగ షేర్లు క్రయ విక్రయాలు జోరుగాసాగడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వరుసగా ఐదు రోజులుగా భారీగా లాభపడిన సూచీలు మంగళవారం అంతే వేగంతో నష్టపోయాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో 950 పాయింట్ల స్థాయిలో నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 820.97 పాయింట్లు లేదా 1.03 శాతం కోల్పోయి 78,675 వద్దస్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 257.85 పాయింట్లు లేదా 1.07 శాతం కోల్పోయి 23,883.45 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టపోవడంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.5,29,525.42 కోట్లు కరిగిపోయి రూ.4,37,24, 546.57 కోట్లు (5.18 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.