ఎస్సీఎస్ఎస్@55
రిటైర్మెంట్ అనంతరం వృద్ధులు స్థిరమైన ఆదాయం పొందేలా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకమే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). సురక్షిత పెట్టుబడులను ఆశించేవారికి ఇదో చక్కని పథకం.
రిటైర్మెంట్ అనంతరం వృద్ధులు స్థిరమైన ఆదాయం పొందేలా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకమే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). సురక్షిత పెట్టుబడులను ఆశించేవారికి ఇదో చక్కని పథకం. అయితే నిబంధనలకు లోబడి, నిర్దిష్ట అర్హతలుంటే 60 ఏండ్లు వచ్చేదాకా ఆగాల్సిన పనిలేదు. 55 ఏండ్లకే ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం ఉంటుంది. 55-60 ఏండ్ల మధ్య సూపర్‌యాన్యుయేషన్‌పై పదవీ విరమణ పొందినవారు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), ప్రత్యేక వీఆర్ఎస్ను తీసుకున్నవారు అర్హులు. అయితే రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుకున్న 1 నెలలోపే ఎస్సీఎస్ఎస్ను తెరువాల్సి ఉంటుంది.
అలాగే నిర్దిష్ట షరతులకు లోబడి రక్షణ శాఖలో పనిచేసి దిగిపోయినవారికైతే 50 ఏండ్లు దాటితే స్కీమ్‌ను తీసుకునే వెసులుబాటున్నది. ఇక ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను ఇందులో పెట్టుబడులపై గరిష్ఠంగా 8.2 శాతం వార్షిక వడ్డీరేటు లభిస్తున్నది. ప్రతి 3 నెలలకోసారి చెల్లింపులుంటాయి. కనీస డిపాజిట్ రూ.1,000. అన్ని ఖాతాల్లో కలిపి రూ.30 లక్షలదాకా పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెట్టుబడి పరిమితి 5 ఏండ్లు. మరో 3 ఏండ్లు పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా లేదా భాగస్వామితో కలిసైనా ఖాతాను తెరుచుకోవచ్చు. అర్హులకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులుంటాయి. లేదంటే వారి వ్యక్తిగత ఐటీ స్లాబు ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలపై జరిమానాలుంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

