న్యూఢిల్లీ, మే 22 : ఇండస్ఇండ్ బ్యాంక్‌లో అక్రమాలు, వాటిలో ఉన్నతాధికారుల పాత్ర, నిబంధనల ఉల్లంఘనల్ని అన్నింటినీ గమనిస్తూనే ఉన్నామని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గురువారం అన్నారు. ఈ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థలో రూ.3,400 కోట్ల మోసం వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్‌తో ఈ అంశంపై మాట్లాడుతామన్నారు. అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ ఉల్లంఘనలపైనా దృష్టిపెట్టినట్టు చెప్పారు. మరోవైపు బ్యాంక్ తాత్కాలిక మేనేజ్మెంట్ తీసుకుంటున్న చర్యలు.. సంస్థ పునర్నిర్మాణానికి వేగంగా దోహదం చేయగలవన్న విశ్వాసాన్ని ప్రమోటర్ అశోక్ హిందూజా వ్యక్తం చేశారు.