SEBI | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాకిచ్చింది. కొంతమంది పెట్టుబడిదారులను పబ్లిక్ వాటాదారులుకు తప్పుగా వర్గీకరించడాన్ని ఆరోపణలపై సెబీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ..మాకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు.