న్యూఢిల్లీ, జూన్ 11: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. మంగళవారం ఓ ఉచిత, స్వచ్చంధ ఆన్లైన్ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి సమగ్ర రీతిలో విజ్ఞానాన్ని పొందడం కోసం ఇది ఉపకరించనున్నది. మరోవైపు 49 మంది ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి సెబీ దరఖాస్తులను ఆహ్వానించింది. జనరల్, లీగల్, ఐటీ, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్, రిసెర్చ్ తదితర విభాగాల్లో నియామకాలుంటాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 27 నుంచి 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.