న్యూఢిల్లీ, జూన్ 2: అంతర్జాతీయ ట్రావెల్ టెక్ దిగ్గజం ఓయో ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.6,650 కోట్ల నిధుల సేకరణకోసం గతంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం కంపెనీ విలువ 7-8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది. ఆరు నెలల క్రితం ఓయో ఐపీవో ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఓయో షేరు హోల్డర్ల సమావేశాన్ని నిర్వహించుకున్నది.
ఈ ఐపీవోకి సంబంధించి లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, సిటీబ్యాంక్, గోల్డ్‌మన్ చాక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాప్స్, జేఎం ఫైనాన్షియల్స్, ఇన్‌క్రెడ్ క్యాపిటల్, ఇంటెన్సివ్ ఫిజికల్ సర్వీసెస్‌లను నియమించుకున్నది. ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతున్నారు. 2021లోనే ఐపీవోకి వస్తున్నట్టు ప్రకటించినప్పటికీ పలు కారణాలతో వాయిదావేసుకున్నది.