న్యూఢిల్లీ, మార్చి 25 : కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి షాకిచ్చింది. కంపెనీకి సంబంధించిన రెండు సంస్థలైన కార్వీ క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, కేసీఏపీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల రిజిస్ట్రేషన్లను రద్దుచేసింది సెబీ. మార్కెట్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. కార్వీ క్యాపిటల్ లిమిటెడ్ ప్రమోట్ చేసినవే కార్వీ క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, కేసీఏపీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్). సెబీ నిబంధనల ప్రకారం కేఎస్‌బీఎల్ వచ్చే ఆరు నెలల వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని హెచ్చరించింది.