Airtel AGR Dispute | ఎయిర్‌టెల్‌కు టెంపరరీ రిలీఫ్.. ఏమైందంటే?!
Airtel-DOT AGR Dispute | టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. వీడియోకాన్ టెలీ కమ్యూనికేషన్స్ (వీటీఎల్)...

Airtel-DOT AGR Dispute | టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. వీడియోకాన్ టెలీ కమ్యూనికేషన్స్ (వీటీఎల్) సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు చెల్లించనందుకు మూడు వారాల వరకు ఎయిర్‌టెల్‌కు ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలను తొలగించొద్దని టెలికంశాఖను జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు సారధ్యంలోని బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇలా ఎయిర్‌టెల్‌కు డీవోటీ డిమాండ్ నోటీస్
రూ.1376 కోట్ల ఏజీఆర్ బకాయిలను వారం లోపు చెల్లించాలని, లేనిపక్షంలో బ్యాంకు గ్యారంటీలు రద్దు చేస్తామని ఈ నెల 17న భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికం శాఖ (డీవోటీ) డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ వివాదం నుంచి రిలీఫ్ కోసం టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ)కు వెళ్లేందుకు ఎయిర్‌టెల్‌కు అనుమతి ఇచ్చింది.
భారతీ ఎయిర్టెల్ వాదన ఇదీ
సునీల్ మిట్టల్ సారధ్యంలోని భారతీ ఎయిర్టెల్ గత మార్చి నాటికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రానికి తమ సంస్థ చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతానికి పైగా రూ.18,004 కోట్లు చెల్లించామని వాదించింది. వీడియోకాన్ నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేశామని దానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలు రూ.45,356 కోట్లు ఇందులో చేర్చొద్దని పేర్కొంది. వీడియోకాన్ టెలీ కమ్యూనికేషన్స్ ఇప్పటికే దివాళా ప్రక్రియలో ఉందని టెలికం శాఖ వెల్లడించిందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airtel
- dot
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

