SBI Personal Loans | దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. యోనో యాప్ ద్వారా ఖాతాదారులు ఎమర్జెన్సీ అవసరాల కోసం ముందస్తు అప్రూవల్ పొందిన పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీనికి ప్రత్యేక రాయితీలు అందిస్తున్నది. ఈ ఫెసిలిటీ బ్యాంక్ ఖాతాదారులకు ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ పర్సనల్ లోన్లపై ఈ నెలాఖరు వరకు ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మినహాయిస్తారు. 9.60 శాతం వడ్డీరేటు నుంచి రుణాలు మంజూరు చేస్తుంది. ఫిజికల్‌గా బ్యాంకు శాఖకు వెళ్లి పత్రాలు సమర్పించాల్సిన అవసరమే లేదు. ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ కావాలి.. డ్రాప్ డ్రౌన్ మెనూలో అవయిల్ నౌ అనే బటన్ క్లిక్ చేయాలి. ఖాతాదారులు తమకు అవసరమైన రుణం మొత్తం నమోదు చేసి చెల్లించే టెన్యూర్ ఎంచుకోవాలి.
బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే బ్యాంకు అధికారులు లోన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఆ వెంటనే మీరు ప్రతిపాదించిన రుణం.. మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఎస్బీఐ ఖాతాదారులు.. పీఏపీఎల్ ><స్పేస్ ఇచ్చి మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగంకెలు టైప్ చేసి 567676 నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తే.. మీ రుణ అర్హత తెలుస్తుంది.