న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్ (ఐఐబీఎక్స్)పై ప్రత్యేక కేటగిరీ క్లయింట్ (ఎస్సీసీ)గా చేరింది. తద్వారా ఐఐబీఎక్స్‌లో తమ మొదటి గోల్డ్ ట్రేడ్ నిర్వహించింది. ఈ మేరకు శనివారం బ్యాంక్ ప్రకటించింది. ఇది పరిశ్రమకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ప్రభావవంతమైన, పారదర్శకమైన ట్రేడింగ్‌కు కలిసిరాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
కాగా, గత ఏడాదే ఐఐబీఎక్స్‌లో ట్రేడింగ్-కమ్-క్లియరింగ్ సభ్యత్వం సాధించిన తొలి బ్యాంక్‌గా ఎస్బీఐ అవతరించింది. ఇప్పుడు ఎస్సీసీగా ఎస్బీఐ చేరింది. దీంతో ఐఐబీఎక్స్ ద్వారా జరిగే పసిడి దిగుమతుల్లో జ్యుయెల్లర్స్, బులియన్ ట్రేడర్లు, ఇతర భాగస్వాములకు గొప్ప మద్దతు లభించినైట్టెంది. దీనిపట్ల బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు.