Agricultural University | హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సుముఖత వ్యక్తం చేసినట్టు యూనివర్సిటీ వీసీ జానయ్య తెలిపారు. సోమవారం ముంబైలో చైర్మన్ శ్రీనివాసులుతో వీసీ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏఐ ల్యాబ్ ఏర్పాటునకు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని ఆయన కోరగా, దీనికి చైర్మన్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. ఈ నెల 20, 21న జరిగే యూనివర్సిటీ వజ్రోత్సవాలకు చైర్మన్‌ను ఆహ్వానించారు. శెట్టి వ్యవసాయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.