వాషింగ్టన్: సీఈవో అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నత ర్యాంకింగ్ అధికారి సీఈవో. మేజర్ కార్పొరేట్ నిర్ణయాలతోపాటు సంస్థ అన్ని ఆపరేషన్లను నిర్వహించడం సీఈవో కీలక బాధ్యతలు. బోర్డు డైరెక్టర్లకు, కార్పొరేట్ ఆపరేషన్లకు సంధానకర్తగా సీఈవో వ్యవహరిస్తారు.
సీఈవోతో పోలిస్తే చైర్మన్ బాధ్యతలు విభిన్నం. చైర్మన్ సంస్థ ఏజెండాను నిర్ణయిస్తారు. కొన్ని కంపెనీలకు సీఈవో, చైర్మన్ ఒక్కరే ఉంటారు.
మైక్రోసాఫ్ట్‌కు వ్యవస్థాపక చైర్మన్ కం సీఈవోగా బిల్ గేట్స్ వ్యవహరించారు. 2000లో సీఈవోగా వైదొలిన బిల్‌గేట్స్ స్థానంలో స్టీవ్ బాల్మెర్ బాధ్యతలు స్వీకరించారు.
2014లో చైర్మన్‌గా బిల్ గేట్స్ స్థానంలో థంప్సన్ నియమితులయ్యారు. 2000 తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్‌గా సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వర్తించనున్నారు.